పలమనేరులో శివకుమార్ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పలమనేరు డిఎస్పి ప్రభాకర్ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ, శివకుమార్ భార్యతో నిందితుడు సమీర్ అక్రమ సంబంధం ఉన్నదని బంధువులు పిర్యాదు చేశారన్నారు. ఇద్దరూ మద్యం తాగి గొడవపడగా సమీర్ శివకుమారును బండరాయితో మోదీ చంపాడన్నారు. సమీర్ కోసం పోలీసులు గాలిస్తున్నారని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.