ఫెంగల్ తుఫాను నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాడి రైతులకు సోమవారం కేవీకే సమన్వయ కర్త మంజుల ముందస్తు సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు రోగనిరోధక శక్తి కోల్పోయి రోగాల బారిన పడుతాయన్నారు. పాల ఉత్పత్తి తగ్గుతుందన్నారు. పశు వైద్యులను సంప్రదించాలని కోరారు. తుఫాను అనంతరం నట్టల నివారణ మందులు తాగించాలన్నారు. టీకాలు వేయించాలని సూచించారు.