విషం తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు శనివారం గుర్రంకొండ ఎస్ఐ మధు రామచంద్రుడు తెలిపారు. బొడ్డువారిపల్లికి చెందిన నూర్ (35) కుటుంబ సమస్యల కారణంగా శనివారం రాత్రి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడంతో కుటుంబీకులు గమనించి 108 వాహనంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధు రామచంద్రుడు తెలిపారు.