బంగారుపాళ్యం: మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు పంపిణీ

68చూసినవారు
బంగారుపాళ్యం: మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలు పంపిణీ
బంగారుపాళ్యం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మహిళా స్వయం సహాయక సంఘాల ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో.. మంగళవారం 10 కోట్ల 20 లక్షల రూపాయలు బ్యాంకు రుణాల రూపేనా అందించడం జరిగింది. ఇందులో 59 గ్రూపులకు గాను ఎనిమిది కోట్ల అరవై లక్షలు, మహిళ పారిశ్రామిక వేత్తలకు కోటి 20 లక్షలు రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ మేనేజర్ సురేంద్రబాబు, ఏపీఎం రవి,మండల టిడిపి అధ్యక్షుడు జయప్రకాశ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్