ఇచ్చిన హామీలన్నింటిని సీఎం చంద్రబాబు నెరవేర్చాలని పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ బుధవారం కోరారు. బంగారుపాలెంలో ఆయన మాట్లాడుతూ. వైసీపీ నాయకులను అక్రమ కేసుల్లో వేధిస్తున్నారని మండిపడ్డారు. కరెంట్ ఛార్జీలుటోల్ ఛార్జీలతో ప్రజలపై అదనపు భారాన్ని మోసేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. హామీలను నెరవేర్చకపోతే ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.