పూతలపట్టు: అన్నదాన సత్రంను తనిఖీ చేసిన ఈఓ

67చూసినవారు
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి అన్నదాన సత్రంలో నూతన ఈవో పెంచల కిశోర్ శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం భక్తులకు రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అన్నదాన సత్రంలో పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్