భక్తిశ్రద్ధలతో ద్రౌపతి దేవి కళ్యాణోత్సవం

74చూసినవారు
భక్తిశ్రద్ధలతో ద్రౌపతి దేవి కళ్యాణోత్సవం
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం వడ్డిపల్లి సమీపంలోని భారత మిట్ట లో జరుగుతున్న మహాభారత యజ్ఞం కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి నిర్వాహకులు ద్రౌపతి దేవి కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కళ్యాణ క్రతువును అంగరంగ వైభవంగా నిర్వహించారు. వర్షం వస్తున్నప్పటికీ లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్