చిత్తూరు జిల్లా పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో 15 కేజీల టమోటా ధర రూ. 750 పలికినట్లు వ్యవసాయ కమిటీ మార్కెట్ కార్యదర్శి సోమవారం తెలిపారు. ధరలు బాగా పెరుగుతూ ఉండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుంగునూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లోని రైతులకు కూడా ఎక్కువ శాతం టమోటా పంటపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. రైతులకు తమ కష్టానికి తగిన ఫలితం రావడంతో దేవుడు తమపై దయ చూపాడని తెలిపారు.