పారిస్ ఒలింపిక్స్‌కు సమస్యగా మారిన సియోన్ నది

63చూసినవారు
పారిస్ ఒలింపిక్స్‌కు సమస్యగా మారిన సియోన్ నది
పారిస్ ఒలింపిక్స్-2024 వేడుకలు జులై 26 నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే పారిస్‌లోని సియోన్ నది ఇప్పుడు ఈ పోటీలకు పెద్ద సమస్యగా మారింది. ఈ నదిలో నీటి నాణ్యత కారణంగా 1923 నుంచి ఇందులో స్విమ్మింగ్ చేయడంపై నిషేధించారు. ఈ నదిలో ఈదడం క్రీడాకరుల ఆరోగ్యానికి ఏమాత్రం సురక్షితం కాదనే విమర్శలు మొదలయ్యాయి. ఈక్రమంలో స్విమ్మింగ్‌ పోటీలపై ఆందోళన నెలకొంది. కాగా, ఫ్రాన్స్ వందేళ్ల తర్వాత ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్