పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం లోని పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం తహసీల్దార్ నాగరాజు, సిఐ కృష్ణారెడ్డి, ఎస్సై వెంకట నరసింహులు పరిశీలించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేటట్లు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ పరిశీలన చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.