మురుగునీటితో ఇబ్బంది పడుతున్న ప్రజలు

59చూసినవారు
మురుగునీటితో ఇబ్బంది పడుతున్న ప్రజలు
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం సమీపంలోని దళితవాడ దగ్గర మురుగు కాలువ నిండి మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. దీనితో అటువైపుగా వెళ్లే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా పక్కనే దళిత వాడ ఉండడంతో ఆ గ్రామ ప్రజలకు దుర్వాసనతో పాటు రోగాలు ప్రబలే అవకాశం ఉందని భయాందోళనకు గురవుతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు వెంటనే ఈ ప్రాంతంలో కల్వర్టు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్