రెవెన్యూ సదస్సులో అందిన వినతులను పరిష్కరిస్తున్నట్లు పుంగనూరు ఎమ్మార్వో రాము తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గత నెల 6 నుంచి జనవరి 8వ తేదీ వరకు మండలంలోని 19 గ్రామాలలో రెవిన్యూ సదస్సులు జరిగాయన్నారు. ఇందులో 331 ఫిర్యాదులు ప్రజల నుంచి అందినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి విచారించి 90 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు.