పుంగనూరు పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్దగల స్పీడ్ బ్రేకర్ వద్ద భాగ్యమ్మ అనే మహిళను మంగళవారం ద్విచక్ర వాహనం ఢీకొనడంతో భాగ్యమ్మ తలకు తీవ్ర గాయం అయింది. వెంటనే స్థానికులు భాగ్యమ్మని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సిఫారసు మేరకు మదనపల్లి ఏరియా ఆసుపత్రి తరలించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.