పుంగనూరు అర్బన్ పుష్కరిణీ వద్ద గల శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో గజ స్తంభ ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఆలయ ప్రధాన అర్చకులు బాలసుబ్రమణ్యం గజ స్తంభాన్ని శుద్ధి చేశారు. తర్వాత గణపతి ప్రార్ధన, పున్వాహ వాచన, అంకురార్పణ, కలిశస్థాపన నిర్వహించారు. ఈ మహోత్సవాలు ఈ నెల 25వ తేదీ బుధవారం వరకు జరుగుతాయని అర్చకులు తెలిపారు.