చర్మకారులకు రుణాలిచ్చి ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చర్మకారుల సంఘ కార్య దర్శి( రొంపిచర్లకు చెందిన) హరిప్రసాద్ ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ ఉండవల్లి శ్రీదేవిని కోరారు. ఈ సందర్భంగా సద్దల హరిప్రసాద్ విజయవాడలో ఆమెను కలిసి చర్మకారుల సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరారు. మాదిగ నిరుద్యోగ యువతీ యువకులకు సబ్సిడీ రుణాలు, చర్మకారులకు వృత్తి రుణాలు కోరినట్లు ఆయన తెలిపారు.