డిగ్రీ కళాశాలలో ఎన్ సి సి విద్యార్థుల ఎంపిక

65చూసినవారు
డిగ్రీ కళాశాలలో ఎన్ సి సి విద్యార్థుల ఎంపిక
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని శుబారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఎన్ సిసి విద్యార్థుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. 35 బెటాలియన్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ రాజశేఖర్, ఎన్ సి సి ఆఫీసర్ డాక్టర్ సోమరాజు ఆధ్వర్యంలో విద్యార్థుల ఎంపిక కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు రన్నింగ్, హైట్, వెయిట్, శారీరక దృఢత్వం, పోటీలు నిర్వహించారు. 39 మంది విద్యార్థులు రాగా 34 మందిని ఎంపిక చేశారు.

సంబంధిత పోస్ట్