పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో తుఫాను ప్రభావం వల్ల గత నాలుగు రోజులుగా కురిసిన వర్షానికి నేలపై పడిన వరి పంటను బుధవారం జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మురళి, ఏడీఏ శివకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు సోమల మండలంలోని వరి పొలాలను పరిశీలించి వరి సాగుచేసిన రైతుకు పలు సూచనలు చేశారు. 10 లీటర్ల నీటికి ఐదు కేజీల కళ్ళు ఉప్పును కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల వరిని మొలకలు రాకుండా కాపాడుకోవచ్చు అన్నారు.