పుంగనూరు నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్ర రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గానికి చెందిన సదుం మండలం తిమ్మానయన పల్లి గ్రామంలో సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల ముందుకు వెళ్లారు. సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు.