రేపు జరిగే భారత్ బంద్ కు సహకరించండి
ఆగస్టు ఒకటో తారీఖున ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం భారత్ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాల మహానాడు మండల అధ్యక్షులు టి. కృష్ణప్ప మంగళవారం రామసముద్రంలో పిలుపునిచ్చారు. ఈ బందుకు సహకరించాలని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. మండలంలో జరిగే ర్యాలీలో మండలంలో ఉన్న మాల ఉద్యోగస్తులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.