సత్యవేడు నియోజకవర్గం వరదయ్య పాలెంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. కడూరు, అర్దూరు గ్రామాల్లో పర్యటించి పంటల సాగు యాజమాన్య పద్ధతులు గురించి చర్చించారు. తప్పనిసరిగా వరిలో కాలిబాటలు ప్రతి రెండు మీటర్లకు 20 సెంటిమీటర్ల చొప్పున వదులుకోవలెను. నారు కొనలు తుంచి నాటుకోవడం ద్వారా కొంత వరకు ఆకుముడత వంటి తెగుళ్లు నివారించేందుకు వీలుంటుందని చెప్పారు.