నాగలాపురం మండలంలోని ఎస్. ఎస్. పురం మాదిగ వాడలో ఉన్న మాతమ్మ ఆలయంలో స్టీల్ హుండీ బుధవారం రాత్రి చోరికి గురైంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు ప్రతి రోజు ఆలయ అర్చకుడు ఆలయాన్ని తెరిచి అమ్మవారికి పూజలు నిర్వహిస్తుంటారు. గురువారం ఉదయం ఆలయాన్ని తెరవడానికి వెళ్లగా గేటుకు ఉన్న తాళం విరిగి కింద పడి ఉండటం గమనించారు. ఆలయం లోపలకు వెళ్లి చూడగా హుండీ కనబడలేదు. ఈ మేరకు గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.