సదాం మండల కేంద్రంలో భారీ చోరీ

85చూసినవారు
సదాం మండల కేంద్రంలో భారీ చోరీ
పుంగనూరు నియోజకవర్గం సదాం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ చోరీ వెలుగు చూసింది. బాధితుని కథనం మేరకు ఎంపీడీవో కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న భాస్కర్ స్వామి శనివారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. ఆదివారం తిరిగి రాగా తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంటిలోకి వెళ్లి పరిశీలించగా బీరువాను పగలగొట్టి అందులో ఉన్న 250 గ్రా. బంగారం, రూ. 2 లక్షల నగదు చోరీ చేసినట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్