పిచ్చాటూరు: సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే భూమి పూజ

62చూసినవారు
సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరులోని బీసీ బాలికల సంక్షేమ హాస్టల్ సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం ఉదయం భూమి పూజ చేశారు. హాస్టల్ కు వెళ్లే విద్యార్థులకు దారి సౌకర్యం లేనందున ప్రభుత్వం సీపీ రోడ్డుకు రూ. 18 లక్షలు నిధులు మంజూరు చేసింది. స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇళంగోవన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. పనులు నాణ్యతగా చేపట్టి త్వరగా పూర్తిచేయాలని నాయకులకు ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్