సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలోని గోవర్ధనపురం బ్రిడ్జిపై సీపీఐ నాయకులు చిన్నిరాజ్ గురువారం నిరసన చేపట్టారు. బీటలు వారిన బ్రిడ్జిని నిర్మించాలని, అప్పటివరకు వాహనాల రాకపోకల కోసం శరవేగంగా తాత్కాలిక మరమ్మతులు చేయాలని తెలిపారు. ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు చెప్పారు. శ్రీకాళహస్తి చెన్నైకి ప్రధాన రహదారి కావడంతో వందలాది వాహనాలు వెళ్తుంటాయని చెప్పారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.