సూర్య భగవానుడికి విశేషంగా అభిషేకం

84చూసినవారు
దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో ఆదివారం సూర్య భగవానుడికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనెతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషంగా భక్తులు సూర్య భగవానుడి అభిషేకంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్