రేణిగుంట పరిధిలోని చెంగారెడ్డి పల్లె గ్రామంలో ఈశ్వరయ్య అనే వ్యక్తిని అతి కిరాతకంగా బండ రాయితో తలపై మోది హతమార్చిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అర్బన్ సిఐ శరత్ చంద్ర, ఎస్సై అరుణ్ కుమార్. రెడ్డి తెలిపిన వివరాల మేరకు గ్రామంలో ఈశ్వరయ్య జీవనం సాగిస్తున్నారు. ఏమి జరిగిందో అర్ధరాత్రి సిమెంట్ రాయితో తలపై మోదినట్లు గుర్తించిన బంధువులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈశ్వరయ్య మృతి చెందినట్లు తెలిపారు.