శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుక్రవారం న్యూఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ అకౌంటెంట్ జనరల్ కె. సుబ్రహ్మణ్యం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఈవో ఎన్. ఆర్ కృష్ణారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.