తిరుపతి జిల్లా డీఈవో శేఖర్ రేణిగుంటకు చెందిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రేణిగుంట మండలంలోని ఆర్ మల్లవరం జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రవి ఇద్దరు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు విద్యార్థుల తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. బుధవారం డీఈవో శేఖర్, ఎంఈఓ బాలాజీ విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు.