హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని సబ్ జైలును శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి, న్యాయవాదులు, పీఎల్వీలు శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. సబ్ జైలు నందు పలు కేసులలో శిక్షణ అనుభవిస్తున్న, పరివర్తన చెందుతున్న వ్యక్తులను వారి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జైలులోని రికార్డులు పరిశీలించి ఖైదీలకు వారి హక్కుల గురించి వివరించారు.