శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలోని శ్రీమృత్యుంజయ స్వామివారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పాలు, పెరుగు, తేనె, పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.