మనోణ్మనికి ప్రత్యేక ఊంజల్ సేవ

79చూసినవారు
శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో శుక్రవారం అమ్మవారైన మనోణ్మనికి ప్రత్యేక ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానాంబిక ఆలయానికి ఎదురుగా ఉయ్యాలపై ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శుక్రవారం రాత్రి ఉత్సవ మూర్తిని ఆలయంలో ఊ రేగించారు. అనంతరం అమ్మవారి సన్నిధి వద్ద దర్పణం ముందు ఉంచి ఆలయ అభిషేక గురుకుల్ సురేశ్ ధూప దీప నివేదనలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్