చెంబేడు కాలువను ఆధునీకరణ చేస్తామని ఆనకట్ట ప్రాజెక్టు వైస్ ఛైర్మన్ శంకర్ నాయుడు సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. స్వర్ణముఖి ఆనకట్ట నుంచి 34 చెరువులకు సాగు నీరు సరఫరా చేసే చెంబేడు కాలువ లైనింగ్ పనులు చేసి ఆధునీకరించడం లక్ష్యంగా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 24 కిలోమీటర్లు సాగే చెంబేడు కాలువ అధ్వానంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామన్నారు.