తెలంగాణ హైకోర్టు జడ్జి టి. మాధవి దేవి శ్రీకాళహస్తీశ్వర స్వామిని తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కల్పించారు. అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను అందజేశారు.