వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన నాయుడుపేటలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సూళ్ళూరుపేట నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తలపై నిరాధారణమైన కేసులు పెట్టి ఏ విధంగా హింసిస్తుందో చూస్తున్నామన్నారు.