సైకిల్ రావాలి సైకో పోవాలి అంటూ నాయుడుపేటలో తెదేపా భారీ ర్యాలీ

570చూసినవారు
నాయుడుపేట పట్టణంలోని విజయ గణపతి ఆలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు మంగళవారం తెదేపా, భాజపా, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థిని నెలవల విజయశ్రీ భారీ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ రావాలి సైకో పోవాలి అంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గంలోని ముఖ్య నేతలు పాల్గొన్నారు. బజారు వీధుల్లో వ్యాపారులు వీరికి పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్