నా భర్తను గెలిపించండి: కల్పన రెడ్డి

62చూసినవారు
వచ్చే ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్ర రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన సతీమణి కల్పన రెడ్డి విస్తృత ప్రచారం చేపట్టారు. కూటమి నాయకులతో కలసి కొత్త రెడ్డివారిపల్లె, బురుజుపల్లెల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి పిల్లల భవిష్యత్తు కోసం టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కృష్ణమూర్తి నాయుడు, రమణారెడ్డి, జగదీశ్, భాస్కర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్