తిరుపతి వై. ఎస్. ఆర్ మార్గంలో సోమవారం భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ను సోమవారం సాయంత్రం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సంధర్భంగా భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాల నుంచి తిరుపతి నగరంలో ప్రతి వేసవికాలంలో రెండు నెలల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతున్నదన్నారు. నేడు ప్రారంభిస్తున్న ఫారిన్ బిల్డింగ్స్ తో కూడుకున్న నమూనా ఎగ్జిబిషన్, పిల్లలు, పెద్దలు ఆహ్లాదం పొందేలా జైంట్ వీల్, కొలంబో అదేవిధంగా మహిళలకు కావలసినటువంటి అన్ని రకముల వస్త్రాభరణాలు ఈ ట్రేడ్ ఫెర్ ఎగ్జిబిషన్లో ఉంచడం జరిగిందన్నారు. 60 లక్షలు వెచ్చించి ఫారిన్ సిటీ నమూనాలను ఏర్పరచడం ఈ సంవత్సరం ప్రారంభిస్తున్న ఎగ్జిబిషన్లో అందర్నీ ఆకట్టుకునే అంశంమని ఎగ్జిబిషన్ నిర్వాహకులు శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మెన్ కేతం జయచంద్రా రెడ్డి, కార్పొరేటర్ అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.