తిరుమలలో కారు దగ్ధం

72చూసినవారు
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన బెంగళూరుకు చెందిన భక్తుల కారు అగ్నిప్రమాదానికి గురైంది. కర్నాటక నుంచి శనివారం రాత్రి తిరుమల బాలాజీ బస్టాండ్ వద్దకు చేరుకోగానే కారులో నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. అప్రమత్తమైన భక్తులు వెంటనే కారు దిగేయడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్