తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు

80చూసినవారు
తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు, దివ్వెల మాధురి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనంతో అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్