మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయం మహా ద్వారం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.