కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించి మొక్కలు చెల్లించుకున్నారు. ముందుగా కేంద్రమంత్రి పద్మావతి అతిథి భవన వద్దకు చేరుకోగా రిసెప్షన్ అధికారి భాస్కర్ ఆయనకు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం కేంద్రమంత్రికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.