కార్మిక సంఘాలు ఎన్నో ఏళ్లుగా ఈఎస్ఐ ఆసుపత్రి సామర్థ్యాన్ని పెంచమని, వంద పడకల ఆసుపత్రిగా మార్చమని పోరాడుతున్న విషయం విధితమేనని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడున్నర కోట్ల రూపాయల నిధుల కేటాయింపుతో ఈఎస్ఐ ఆసుపత్రిని వంద పడకలుగా మార్చడం పట్ల సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆదివారం ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. వంద పడకల ఆసుపత్రిగా మారడంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి కృషి అభినందనీయమని అన్నారు.