వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకు తిరుపతి జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం నియమించారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులుగా తిరుపతి రూరల్ మండలం చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా చిన్ని యాదవ్, రైతు విభాగం అధ్యక్షులుగా మల్లం చంద్రమౌళి రెడ్డి నియామకం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ అధినేత జగన్, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.