వెంకటగిరి: విచ్చలవిడిగా రాత్రివేళల్లో రోడ్లుపై ఆవులు

70చూసినవారు
తిరుపతి జిల్లా బాలయపల్లె మండలం మేల్చూరు, సంగవరం, మల్లెమాల తదితర ప్రాంతాలలో రాత్రివేళ ఆవులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. నాయుడుపేట నుంచి వెంకటగిరి వెళ్లే రహదారిపై మేల్చూరు గ్రామం వద్ద నడిరోడ్డుపై రాత్రి సమయంలో ఆవులు నిద్రిస్తున్నాయి. అటుగా వెళ్లే వాహనదారులు ప్రమాదాలు జరుగుతాయని వాపోతున్నారు. అధికారులు ఆవుల యజమానులను పిలిపించి తమ గ్రామాలకు తీసుకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్