అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. తమ్ముడు మృతి

78చూసినవారు
అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. తమ్ముడు మృతి
అనంతపురం జిల్లాలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి తన తమ్ముడిని దారుణంగా హతమార్చాడు. మద్యం మత్తులో ఉన్న తమ్ముడు రామకృష్ణారెడ్డి (35)పై కర్రతో దాడి చేశాడు. దాంతో తీవ్ర రక్తస్రావమై రామకృష్ణారెడ్డి ప్రాణాలు విడిచాడు. గత కొద్ది రోజులు అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే దాడి చేసి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్