AP: విశాఖలో నేషనల్ డిప్ టెక్ కాంక్లేవ్ ప్రారంభమైంది. ఈ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పారిశ్రామిక రంగాల్లో అత్యాధునిక మార్పుపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు ఎగ్జిబిషన్ సందర్శించారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. ‘టెక్నాలజీ మన జీవితంలో భాగమైంది. ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చాలనుకుంటున్నాం. టెక్నాలజీని పెంచుకుని ఖర్చులను తగ్గించుకోవాలి. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా వినియోగించుకోవాలి.’ అని అన్నారు.