AP: మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు చేశారు. ఏపీ మంత్రివర్గ భేటీ అనంతరం పలు అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పల్లె నిద్ర చేయాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. నెలలో 4 రోజులపాటు ప్రజాప్రతినిధులు పల్లె నిద్ర చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం చేసిన మంచిని, పథకాల గురించి ప్రజలకు చెప్పుకోవాలని స్పష్టం చేశారు.