ఏపీ అసెంబ్లీ ఆవరణలో దొంగల హల్ చల్

82చూసినవారు
ఏపీ అసెంబ్లీ ఆవరణలో దొంగల హల్ చల్
ఏపీ అసెంబ్లీలో దొంగలు హల్ చల్ చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా బుధవారం నాగబాబుతో పాటు పలువురు నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో నాయకులతో పాటు వారి వెంట అభిమానులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఇదే అదనుగా జేబు దొంగలు రెచ్చిపోయారు. నాయకులు అలాగే వారి గన్ మెన్‌ల జేబులను లూటీ చేశారు. దాదాపు రూ.4 లక్షలు చోరీ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్