బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కేసరి చాప్టర్-2’. ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహిస్తుండగా మాధవన్, అనన్యపాండేలు కీలక పాత్రలలో నటిస్తున్నారు. మాధవన్, అక్షయ్‌ల మధ్య జరిగిన సన్నివేశాలు, డైలాగ్‌లు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కాగా, ఏప్రిల్ 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.