తల్లికి బదులు పరీక్ష రాసిన కూతురు.. చివరికి

54చూసినవారు
తల్లికి బదులు పరీక్ష రాసిన కూతురు.. చివరికి
తమిళనాడులోని నాగపట్నంలో షాకింగ్ ఘటన జరిగింది. నటరాజన్-తమయంతి పాఠశాలలో బుధవారం 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష రాస్తున్న విద్యార్థినిని అనుమానం వచ్చి చెక్ చేయగా.. ఆ స్టూడెంట్‌ అడ్మిట్ కార్డులోని ఫోటో, పరీక్ష ఇన్విజిలేటర్ వద్ద గల హాజరు రిజిస్టర్‌లోని ఫోటోకు భిన్నంగా ఉంది. దీంతో అధికారులు వచ్చి ఎంక్వైరీ చేయగా.. సెల్వాంబిక (23) అనే యువతి, తన తల్లి సుగంధి (44)లాగా నటించి పరీక్ష రాయడానికి ప్రయత్నించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్